జిల్లా స్థాయి ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి

  • దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డుకెక్కిన కేరళ

కోచ్చి : జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది. ఎర్నాకులం జనరల్‌ ఆసుపత్రిలో ఓ 50 ఏళ్ల తల్లి తన 28 ఏళ్ల కొడుకుకు కిడ్నీ ఇవ్వడానికి ముందుకురావడంతో ఈ అవయవ మార్పిడిని వైద్యులు విజయవంతం గా నిర్వహించారు. తల్లీకొడుకులిద్దరూ క్షేమంగానే ఉన్నారు. ఇటువంటి శస్త్ర చికిత్సకు అవసరమైన అధునాతన వైద్య పరికరాలు, తగిన నిపుణులను జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులు కలిగి ఉండడం గొప్ప విషయం. ఇది కేరళకే సాధ్యం

➡️