అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ లెఫ్ట్ ఫ్రంట్ మార్చ్

కొల్‌కతా : వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ లెఫ్ట్‌ ఫ్రంట్‌ శనివారం కొల్‌కతాలో మార్చ్‌ నిర్వహించింది. ధర్మతల నుంచి పార్క్‌ సర్కస్‌ వరకు ఈ పాదయాత్ర సాగనుంది.రాష్ట్రంలోని 16 లోక్‌సభ స్థానాలకు లెఫ్ట్‌ ఫ్రంట్‌ తన అభ్యర్థులను ప్రకటించింది. ‘బంగ్లా బచావో-దేశ్‌ బచావో’ అన్న నినాదాలు హోరెత్తాయి. ఈ ఎన్నికల్లో ‘ బిజెపి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలను ఓడించండి- ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, పౌర హక్కులను కాపాడండి’ అని ప్రజానీకానికి లెఫ్ట్‌ ఫ్రంట్‌ పిలుపునిచ్చింది. అవినీతి, దోపిడీని నిరోధించేందుకు తీర్పు ఇవ్వండి. పార్లమెంట్‌లో ప్రజల గొంతుకను బలపరిచేందుకు వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల అభ్యర్థులను గెలిపించండి అని లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేతలు కోరారు. పౌరసత్వ సవరణ చట్టం పేరుతో విభజన రాజకీయాలను ఆపాలని వారు డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా బిజెపి మనీలాండరింగ్‌కు పాల్పడిందని, ఆ డబ్బు అంతటిని కక్కించాలని లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేతలు కోరారు.

➡️