నేడు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

Feb 1,2024 10:57 #Budget, #nirmala sitharaman

న్యూఢిల్లీ :    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటులోకి వెళుతున్న సమయంలో తన డిజిటల్‌ టాబ్లెట్‌తో ఫొటోలకు ఫోజులిచ్చారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశారు రికార్డును సమం చేస్తూ ఆమె వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. పూర్తి బడ్జెట్‌ను కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం జులైలో సమర్పించే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పు, అధిక ప్రామాణిక తగ్గింపు, సెక్షన్‌లు 80సి, 80డి కింద మినహాయింపులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

➡️