నవంబర్‌ 30 తరువాత బీఆర్‌ఎస్‌ ఉండదు : భట్టి

Nov 16,2023 14:38 #Assembly Elections, #Telangana
No-BRS-after-November-30-Bhatti

ఖమ్మం: తెలంగాణలో నవంబర్‌ 30 తరువాత రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఉండదనిసీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి భవిష్యత్తు లేదని.. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు నిర్ణయించారని తెలిపారు. ఆరు గ్యారంటీలను ప్రభుత్వం ఏర్పాటైనా 100 రోజుల్లో అమలు చేస్తామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలో భట్టి విక్రమార్క గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ 10 సంవత్సరాలు రాష్ట్ర సంపదను దోచుకున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు వదిలించుకోవాలనుకుంటున్నారన్నారు. ఈ క్రమంలో రామచంద్రపురం గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి భట్టి సమక్షంలో 30 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరాయి.

➡️