ఏప్రిల్‌ – జూన్‌ మధ్య 20 రోజుల పాటు వడగాడ్పులు : ఐఎండి హెచ్చరిక

Apr 2,2024 10:50 #hot weather, #IMD warning

న్యూఢిల్లీ : ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య 20 రోజుల పాటు అత్యంత వడగాడ్పులు (హీట్‌ వేవ్స్‌ ) ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉండనున్నాయి. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో సాధారణం కన్నా తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా ఉండనున్నాయి. మైదాన ప్రాంతాల్లో ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు ఐఎండి డైరెక్టర్‌ జనరల్‌ మత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఈ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 10 నుంచి 20 రోజుల వరకు తీవ్రమైన వడగాడ్పులు ఉంటాయని వీస్తాయని, సాధారణంగా 4 నుంచి 8 రోజుల మధ్య ఉండే ఆ సమయం ఈ సారి పెరగనున్నట్లు పేర్కొన్నారు. హీట్‌వేవ్‌ ప్రభావం ఎక్కువగా గుజరాత్‌, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్నాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఉత్తర చత్తీస్‌ఘడ్‌, ఆంధ్రాపై ఉండనున్నట్లు ఐఎండి తెలిపింది. ఏప్రిల్‌ నెలలో ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సెంట్రల్‌, సౌత్‌ ఇండియా ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉంటుందని, ఏప్రిల్‌లో గుజరాత్‌, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఆంధ్రాలు హీట్‌వేవ్‌ ఉంటుందని ఐఎండి అంచనా వేసింది.

➡️