Supreme Court : భోజ్‌శాల కాంప్లెక్స్‌లో ఎఎస్‌ఐ సర్వేపై స్టేకు నిరాకరణ

భోపాల్‌ :    మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల (కమల్‌ మౌలా మసీదు ) కాంప్లెక్స్‌లో శాస్త్రీయ సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. అయితే భారత పురావస్తు శాఖ (ఎఎస్‌ఐ) సర్వే ఫలితాలపై కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టకూడదని పేర్కొంది.

శాస్త్రీయ సర్వేపై మార్చి 11న మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మౌలానా కమాలుద్దీన్‌ వెల్ఫేర్‌ సొసైటీ  పిటిషన్  దాఖలు చేసింది. ఈ  పిటిషన్‌పై విచారణ చేపట్టిన  జస్టిస్‌ హృషికేష్‌ రాయ్ , జస్టిస్‌ పి.కె. మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్రం, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, ఎఎస్‌ఐ తదితరులకు నోటీసులు జారీచేసింది.  ప్రాంగణం స్వభావాన్ని మార్చే ఎటువంటి తవ్వకాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది.

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో ఉన్న ఈ మధ్యయుగం నాటి ఈ నిర్మాణాన్ని సరస్వతి దేవాలయంగా హిందువులు భావిస్తుండగా, మసీదు అని ముస్లింలు అని వాదిస్తున్నారు. 2003, ఏప్రిల్‌ 7న ఎఎస్‌ఐ నిబంధన ప్రకారం.. మంగళవారం నాడు హిందువులు పూజలు చేస్తుండగా, ముస్లింలు శుక్రవారం నమాజ్‌లు నిర్వహిస్తున్నారు.

➡️