‘హలాల్‌’పై యుపి సర్కారుకు సుప్రీం నోటీసులు

Jan 6,2024 10:52 #Halal, #notices, #Supreme Court, #UP Govt

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో హలాల్‌ సర్టిఫికెట్‌ను నిషేధించడంతోపాటు కేసు నమోదు చేయడంపై హలాల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. గత ఏడాది నవంబర్‌లో, నకిలీ హలాల్‌ సర్టిఫికెట్లను పంపిణీ చేసినందుకు ఈ కంపెనీతోసహా అనేక సంస్థలపై ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆర్థికంగా లబ్ధి పొందేందుకు ప్రజల మతపరమైన మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. హలాల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తనపై సుప్రీంకోర్టులో జరుగుతున్న క్రిమినల్‌ ప్రొసీడింగ్‌లను క్యాన్సిల్‌ చేయాలని కోరింది. యుపిలో హలాల్‌ సర్టిఫికేట్‌ను నిషేధించడంపై కోర్టు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంతోపాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ నుంచి సమాధానం కోరింది.

➡️