అమేథీ, రాయ్ బరేలీ స్థానాలపై వీడిన ఉత్కంఠ

May 3,2024 11:28 #Amethi, #Raebareli, #Rahul Gandhi

న్యూఢిల్లీ : యుపిలోని అమేథీ, రాయ్ బరేలీ సీట్లలో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ వీడింది. రాయ్ బరేలీ నుండి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పోటీ చేయనున్నట్లు శుక్రవారం అధిష్టానం ప్రకటించింది. రాహుల్‌ ఇప్పటికే కేరళలోని వయనాడ్‌ నుండి కూడా బరిలోకి దిగారు. అమేథీ నుండి గాంధీ కుటుంబానికి సన్నిహితులైన కిశోర్‌లాల్‌ శర్మ పోటీ చేయనున్నట్లు తెలిపింది. ఈ సారి లోక్‌సభ ఎన్నికలకు కూడా ప్రియాంక గాంధీ వాద్రా దూరంగా ఉన్నారు. రాయ్ బరేలీ నుండి ఆమె పోటీ చేస్తారని వార్తలు వెలువడిన సంగతి తెెలిసిందే.

రాహుల్‌గాంధీ, కిశోర్‌లాల్‌లు నేడు నామినేషన్లు సమర్పించనున్నారు. రాహుల్‌ గాంధీ ఇప్పటికే రారుబరేలీ చేరుకున్నారు. రోడ్‌షో అనంతరం నామినేషన్లు సమర్పించనున్నట్లు సమాచారం. సోనియాగాంధీతో పాటు ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీలు కిశోర్‌లాల్‌ శర్మతో పాటు ప్రచారంలో పాల్గననున్నట్లు సమాచారం.

➡️