యుపి బరిలో తెలంగాణ మహిళ

Apr 18,2024 23:24 #Telangana, #UP elections, #woman

లక్నో : తెలంగాణ మహిళ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల బరిలో నిలిచారు. ఆమె పేరు శ్రీకళారెడ్డి. ఈమె ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె భర్త ధనుంజరుసింగ్‌ మాజీ ఎంపి. అతనికి కిడ్నాప్‌, అక్రమవసూళ్ల కేసులో శిక్షపడడంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. దీంతో తాజా ఎన్నికల్లో జౌన్‌పూర్‌ స్థానం నుంచి బిఎస్‌పి టికెట్‌పై ఆయన భార్య శ్రీకళారెడ్డి పోటీ చేశారు. ఈ స్థానానికి త్రిముఖ పోటీ నెలకొంది.
భాజపా తరపున కృపాశంకర్‌సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ తరపున బాబూసింగ్‌ కుశ్వాహా పోటీ చేశారు. ఉన్నారు. కాగా, శ్రీకళారెడ్డి తండ్రి కె.జితేందర్‌రెడ్డి. ఈయన నల్గొండ జిల్లా కోఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడిగా, హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈమె తల్లి లలితారెడ్డి. గ్రామసర్పంచిగా చేశారు. శ్రీకళారెడ్డి ఇంటర్మీడియట్‌ చెన్నైలో చేయగా, బీకామ్‌ కోర్సు హైదరాబాద్‌లో పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక అమెరికాకు వెళ్లి ఆర్కిటెక్చర్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సు చేశారు.
శ్రీకళారెడ్డి పేరిట రూ.780 కోట్ల స్థిరాస్తులు, రూ.6.71 కోట్ల చరాస్తులు ఉన్నాయి. రూ.1.74 కోట్లు విలువైన ఆభరణాలున్నాయి. ధనుంజరు సింగ్‌ వద్ద రూ.3.56 కోట్ల చరాస్తులు, రూ.5.31 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
ఈమె 2017లో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో తెలంగాణ బిజెపిలో కూడా చేరారు. 2021లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో గెలిచారు. జెడ్పీ అధ్యక్షరాలిగా బాధ్యతలు చేపట్టారు..

➡️