మోడీకి మరింత ప్రమాదకరంగా కేజ్రీవాల్‌ : సంజయ్ రౌత్‌

Mar 26,2024 00:16 #BJP, #Kejriwal

ముంబయి : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై శివసేన (యుబిటి) ఎంపి సంజయ్ రౌత్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ అంటే ప్రధాని మోడీకి భయం, కానీ ఇప్పుడు కేజ్రీవాల్‌ మరింత ప్రమాదకరంగా మారారని అన్నారు. అరెస్ట్‌ అనంతరం కేజ్రీవాల్‌ జైలు నుండి పాలన సాగించడంతో ప్రధాని మోడీకి ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారారని అన్నారు. ప్రజలు ఆయన మాట వింటారని, ఆయనకు పూర్తి మద్దతునిస్తారని చెప్పారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో జైలుకు వెళ్లిన నేతలు మరింత బలంగా బయటకు వచ్చారని తెలిపారు. మార్చి 31న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా ఫోరం చేపట్టనున్న భారీ ర్యాలీలో తాను కూడా పాల్గొననున్నట్లు ప్రకటించారు

➡️