cyclone : జలదిగ్బంధంలో మణిపూర్‌

  • ఐదుగురు మృతి

మణిపూర్‌ : మణిపూర్‌లో రెమాల్‌ తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఐదుగురు మరణించారు. మరో 13మంది గాయపడ్డారు. లక్షలాది మందిపై వరదల ప్రభావం పడింది. ఇంఫాల్‌ నగరం నుంచి ప్రవహించే చాలా నదుల్లో నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక మీడియా కథనం మేరకు … వరద బీభత్సానికి మే 28 నుంచి మే 31 వరకు వరుసగా మరణించారు. సహాయ, విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం … రాష్ట్రంలో 255 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. 16,364 ఇళ్లు దెబ్బతిన్నాయి. వరదల్లో చిక్కుకున్న 20,504 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 522 హెక్టార్ల పంట ప్రాంతాలు నష్టపోయాయి. కొండ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో గత మూడు రోజుల్లో 292 కొండచరియలు విరిగిపడ్డాయి. బాధితుల కోసం 51 సహాయక శిబిరాలను ప్రారంభించినట్లు అధికారిక నివేదిక తెలిపింది. ఇంఫాల్‌ గుండా ప్రవహించే చాలా నదులలో నీటి మట్టాలు వేగంగా పెరిగాయి. రెండు ప్రధాన నదులు ఇప్పటికే ఇంఫాల్‌ తూర్పు, పశ్చిమ జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినీత్‌ జోషితో కలిసి ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌ సింగ్‌ ఇంఫాల్‌లోని వరద ప్రభావిత పానా బజార్‌ను సందర్శించారు.

 

➡️