భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తికి ప్రతిబింబం ఉగాది వేడుకలు : సీతారాం ఏచూరి

న్యూఢిల్లీ   :   తెలుగు ప్రజలకు సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉగాది, చైత్ర నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మరాఠీలు గుడి పడ్వా పేరుతో, మణిపూర్‌లోని మైతేయిలు సాజిబు నొంగ్మా పన్బా చీరోబా పేరుతో, సింధీ హిందువులు చేతి చంద్‌ పేరుతో, కాశ్మీరీ పండిట్‌లు నవ్‌రెహ్  పేరుతో ఇదే రోజున నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వారికి కూడా  శుభాకాంక్షలు తెలిపారు.  ఈ వైవిధ్యమైన నూతన సంవత్సర వేడుకలు ప్రజలంతా ఒకేరోజున జరుపుకోవడం భారతదేశంలోని భిన్నత్వంలో ఆనందాన్ని, ఏకత్వంలో స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ఏచూరి అన్నారు.

➡️