బిజు జనతాదళ్‌ సీనియర్‌ నేత దామోదర్‌ రౌత్‌ మృతి

 భువనేశ్వర్‌ :   ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బిజు జనతా దళ్‌ (బిజెడి) ప్రముఖ నేత దామోదర్‌ రౌత్‌ (83) మరణించారు.   కిడ్నీ సమస్యలతో శుక్రవారం ఉదయం ఆయన మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.  ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌కు సన్నిహితులుగా మెలిగారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

1974 నుండి దామోదర్‌ రౌత్‌ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన పంచాయితీ రాజ్‌ శాఖ, ఆరోగ్యం, వ్యవసాయం సహా వివిధ హోదాల్లో పనిచేశారు. పంచాయితీ రాజ్‌ వ్యవస్థలోని పలు సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. రౌత్‌ చివరిసారిగా 2014 నుండి 2019 వరకు బాలికుడ- ఎర్సమా నియోజవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2019 ఎన్నికలకు ముందు బిజెపిలో చేరినప్పటికీ..  వెంటనే తిరిగి  బిజెడిలో చేరారు.  ఇటీవల బిజెడి ఆయనపై విధించిన  బహిష్కరణ వేటుని రద్దు చేసింది.

దామోదర్‌ రౌత్‌ మృతికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సంతాపం తెలిపారు. ఇది ఒడిశా రాజకీయాల్లో కోలుకోలేని నష్టమని, ఆయన సేవలు అమూల్యమైనవని అన్నారు.

➡️