తమిళనాడు అభివృద్ధికి కృషి చేశాం

Apr 16,2024 00:27 #PM Modi
  • ప్రధాని మోడీ గొప్పలు

తిరునల్వేలి : గత పదేళ్లలో తమిళనాడు అభివృద్ధి కోసం రాత్రింబవళుతేడా లేకుండా కృషి చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకున్నారు. తమిళనాడులోని తిరునెల్వీలి జిల్లాలో సోమవారం ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్నారు. అంబసముద్రం సమీపంలోని అగస్తియార్‌పట్టిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత డిఎంకె పాలనలో తమిళనాడు అవినీతి, డ్రగ్స్‌ మహమ్మారిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఈసారి ఎన్‌డిఎకు ఓటు వేయాలని కోరారు. అట్టింగల్‌ లోక్‌సభ స్థానంలోని కట్టకాడ వద్ద జరిగిన బిజెపి ర్యాలీలోనూ మోడీ ప్రసంగించారు. కేరళలోని విజయన్‌ ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగజారుస్తుందని అన్నారు. పైగా ఈ విషయంలో కేంద్రాన్ని నిందిస్తుందని మోడీ ఆరోపించారు.

➡️