అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

Mar 20,2024 20:40 #raithu, #Suicide

ప్రజాశక్తి- బుచ్చినాయుడు కండ్రిగ (తిరుపతి జిల్లా) :అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. తిరుపతి జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి మృతుని కుటుంబసభ్యుల కథనం ప్రకారం… బిఎన్‌ కండ్రిగ మండలం వెస్ట్‌ వరత్తూరు గ్రామానికి చెందిన కొండేటి మణి (30)కి రెండు ఎకరాల పొలం ఉంది. మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప పంట సాగు చేశారు. పంటకు తెగులు సోకి పూర్తిగా నష్టం వాటిల్లింది. పెట్టుబడి కోసం తెచ్చిన నాలుగు లక్షల రూపాయల అప్పు ఎలా తీర్చాలో తెలియక దిగులుతో పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పక్క పొలాల్లోని రైతులు గమనించి ఆయన భార్య లేఖకు సమాచారం ఇచ్చారు. రైతు కుటుంబాన్ని ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️