ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌కు కీలకమైనవి: మంత్రి అమర్‌నాథ్‌

Mar 7,2024 15:31 #minister amarnadh, #press meet

అమరావతి: ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ కు కీలకమైనవి అని, ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటానని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. సీఎంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అవ్వడం చారిత్రక అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక, ఆ దిశగా ఎటువంటి ఆలోచనలు కాదు కానీ తడబాటు కానీ ఉండదు అని తెలిపారు. డిప్యూటీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ గా పార్టీ విజయానికి కృషి చేస్తాను అన్నారు. 15 నియోజకవర్గాలు గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాను.. లక్షల మంది సమక్షంలో ముఖ్యమంత్రి నాకు కల్పించిన భరోసా అని ఆయన పేర్కొన్నారు. అయితే, చాలా మంది తన పరిస్థితి ఏంటని, ఎక్కడి నుంచి పోటీ చేస్తావని అడుగుతున్నారు.. తన పనైపోయిందని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.

➡️