కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి- ఎవి నాగేశ్వరరావు

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని స్టేట్‌ గవర్నమెంటు కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌ వర్కర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎవి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2014 జూన్‌ ముందు నుంచి ఎన్‌హెచ్‌ఎం, ఇతర వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న స్టాఫ్‌ నర్సులు, 2వ ఎఎన్‌ఎంలు, పారామెడికల్‌ సిబ్బంది అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని వయో పరిమితిలిచ్చి రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. అలాగే 2014 జూన్‌ తర్వాత వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేసేందుకు నిర్దిష్ట విధానాన్ని ప్రకటించాలన్నారు. రెగ్యులరైజేషన్‌లో భాగంగా అందరికీ చట్ట ప్రకారం రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా గ్రాస్‌ శాలరీ చెల్లించాలని, రిటైర్మ్‌ంటు బెనిఫిట్స్‌, ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు. దీంతోపాటు రిటైర్మెంటు వయసు 62 ఏళ్లకు పెంచాలని ఆయ విజ్ఞప్తి చేశారు.

➡️