కీసరలో అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య

Feb 17,2024 15:45 #Couple committed suicide, #keesara

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : జిల్లా పరిధిలోని కీసరలో విషాదం నెలకొంది. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో దంపతులు సురేశ్‌(48), భాగ్య(45) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పిల్లలను బంధువుల ఇంటికి పంపి పురుగుల మందు తాగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దంపతుల ఆత్మహత్యలో పిల్లు అనాథలయ్యారు. క్రెడిట్‌ కార్డు బిల్లులు కట్టలేకనే దంపతులు ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది.

➡️