జగన్‌ సభలకు వారం ముందు నుంచే ఆంక్షలు : అచ్చెన్నాయుడు

Feb 17,2024 14:29 #achennaidu, #press meet

అమరావతి: ఏపీలో రూల్‌ ఆఫ్‌ లా లేదని.. వైసీపీ సభలకు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయడు పేర్కొన్నారు. టీడీపీ సభలకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు నిరాకరిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు, ఉద్యోగసంఘాలు, ప్రజాసంఘాల కార్యక్రమాలకు అడ్డంకులు, నిర్బంధాలు, హౌస్‌ అరెస్టులు చేస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.జగన్‌ సభలకు వారం ముందు నుంచే ఆంక్షలు పెట్టి ప్రజలను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. రాప్తాడులో జగన్‌ సభకు హైవే పక్కన నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వారం ముందు నుంచే హైవే రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధిస్తున్నారన్నారు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌ లకు తీసుకెళ్లలేని పరిస్థితిని జగన్‌ కల్పించారన్నారు. వైసీపీ ఆగడాలు ఇంకెంత కాలమో సాగవని… వాళ్లకు కౌంట్‌ డౌన్‌ మొదలైందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

➡️