జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో వైసిపి మోసం చేసింది : యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు

Feb 16,2024 15:01 #Dharna, #youth congress leaders

సత్తెనపల్లి: జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో వైసిపి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఏపీ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని ముట్టడించారు. ఇంటి ముందు బైఠాయించి ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు. 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని జగన్‌ గాలికొదిలేశారని విమర్శించారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయటానికి ప్రభుత్వం సిద్ధమా?అని ప్రశ్నించారు. బై బై జగన్‌ రెడ్డి , బై బై వైసీపీ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

➡️