తిరుమలలో తగ్గిన యాత్రికుల రద్దీ

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో రెండు కంపార్టుమెంట్లు మాత్రమే నిండాయి. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. మంగళవారం స్వామివారిని 61,135 మంది యాత్రికులు దర్శించుకోగా 19,004 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా టీటీడీ హుండీ ఆదాయం రూ. 3.78 కోట్లు వచ్చిందని వెల్లడించారు.యాదుగిరి యతిరాజ మఠం ప్రధాన పీఠాధిపతి నారాయణ రామానుజ జీయర్‌ మేల్కోటే బుధవారం తెల్లవారుజామున వేంకటేశ్వర స్వామి దర్శించుకుని ప్రార్థనలు చేశారు. ఆయనకు డీవైఈవో హరిద్రనాథ్‌, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి గర్భాలయానికి తీసుకెళ్లారు.

➡️