తిరుమలలో తగ్గిన రద్దీ.. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు యాత్రికుల రాక తగ్గింది. మూడు రోజులుగా తిరుమల కొండపై యాత్రికుల తాకిడి పెరుగగా బుధవారం మాత్రం తగ్గుముఖం పట్టింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు స్వామివారిని దర్శించుకునేందుకు రెండు కంపార్టుమెంట్లలో వేచియున్నారు.టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడి అధికారులు వెల్లడించారు. మంగళవారం స్వామివారిని 63,021 మంది యాత్రికులు దర్శించుకోగా 19,091 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.15 వచ్చిందని వివరించారు.

➡️