తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమల: పుణ్యక్షేత్రం తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన యాత్రికులు 5 కంపార్టుమెంట్లలో వేచి యున్నారని టీటీడీ ఆలయ అధికారులు వివరించారు. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని తెలిపారు. బుధవారం స్వామివారిని 60,928 మంది యాత్రికులు దర్శించుకోగా 22,358 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.34 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్‌ 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు టీటీడీ స్థానికాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు. ఈ కారణంగా సుప్రభాతం సేవా టికెట్లు జారీ చేయబోమని , భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ ధనుర్మాస దర్శనం కల్పిస్తున్నామని అన్నారు.

➡️