దేశానికి బీజేపీ ప్రమాదకరం: పొలిట్‌బ్యూరో సభ్యులు విజయ రాఘవన్‌

Nov 19,2023 15:56 #cpm

మిర్యాలగూడ : బీజేపీ దేశానికి ప్రమాదకరంగా మారిందని, ఈ ప్రమాదాన్ని నివారించాలంటే కమ్యూనిస్టులను గెలిపించాల ని సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ విజయ రాఘవన్‌ పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ లో సీపీఐ(ఎం) అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి గెలుపును కోరుతూ శనివారం పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు, మండలంలోని గూడూరు, లక్ష్మీపురం గ్రామాల్లో నిర్వహించి న కార్నర్‌ మీటింగ్‌లలో ఆయన మాట్లాడారు. మతోన్మాద బీజేపీ దేశంలో ప్రజల మధ్య విద్వేషాలు సఅష్టించి రాజకీయంగా లబ్దిపొందాలని చూస్తోందని విమర్శించారు. మోడీ అధికారంలోకి వచ్చాకే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, పేదల కొనుగోలు శక్తి తగ్గిపోయిందన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తూ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు కుట్రలు పన్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు మేలుకోకపోతే దేశానికి ప్రమాదం ఏర్పడుతుందని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు చైతన్యవంతులు కావాలని, జూలకంటి రంగారెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపించినట్టయితే అన్ని వర్గాల ప్రజల సమస్యలపై చట్టసభలో ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం కఅషి చేస్తారని చెప్పారు. డబ్బు బలంతో వచ్చే బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించి బుద్ధి చెప్పాలన్నా రు. సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు డబ్బుందన్న అహంకారంతో వాటిని పంచి గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్‌నాయక్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, రమ, ఎంవీ రమణ, డబ్బికా ర్‌ మల్లేష్‌, ఐద్వా జిల్లా అధ్యక్షులు వరలక్ష్మి, జిల్లా నాయకులు రవినాయక్‌, డా.మల్లు గౌతమ్‌రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, పరుశరాములు, భావండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి, ఎండి అంజాద్‌, వదూద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️