నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌..

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ నిర్వహించే కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశంలో ఆయన పాల్గననున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ అధిష్టానం జాతీయ స్థాయిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేశారు. అభ్యర్థుల ఎంపికపై తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఈనెలలో ఇది రెండో సారి. కాగా.. కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) భేటీ ఉన్న నేపథ్యంలో రేవంత్‌ ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే.. ఆయన, సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత మూడునెలల్లో ఢిల్లీకి వెళ్లడం ఇది 11వ సారి కావడం విశేషం. అయితే.. ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్‌ సీఈసీ భేటీ జరగనున్నది. దీనికి రేవంత్‌తోపాటు మంత్రి ఉత్తమ్‌ కూడా హాజరవుతున్నారు.

➡️