పండగ పూట విషాదం.. రెండు టూరిస్టు బస్సులు ఢీ

Jan 15,2024 14:35 #road accident, #srikakulam
  • ఒకరు మృతి.. 30 మందికి గాయాలు

ప్రజాశక్తి-కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస జాతీయ రహదారి పై సోమవారం వేకువజామున రెండు బస్సులు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన 100 మంది యాత్రికులు రెండు టూరిస్టు బస్సుల్లో ఒడిశాకు వెళ్లి పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్తుండగా పలాస సమీపంలో హైవేపై ముందు వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి వచ్చిన మరో బస్సు ఢీ కొంది. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. సుమారు 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

➡️