పండగ వేళ విషాదాలు – గాలిపటాలు ఎగరేస్తూ 9మంది మృతి

Jan 16,2024 13:03 #9, #Festivals, #people died, #Tragedies

తెలంగాణ : పండుగ వేళ హైదరాబాద్‌ నగరంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు గాలిపటాలు ఎగురవేస్తూ 9మంది మృతి చెందారు. రహ్మత్‌నగర్‌లో స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరవేయడానికి వెళ్లిన కపిల్‌ దేవ్‌ (23) అనే యువకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి ప్రమాదశాత్తూ కిందపడి మృతి చెందాడు. అతడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురు స్నేహితుల ప్రమేయంపై అనుమానంతో కుటుంబ సభ్యులు మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హైదరాబాద్‌ యాప్రాల్‌లో పతంగి ఎగరవేస్తూ భువన్‌ సాయి అనే బాలుడు భవనంపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా మంగళవారం ఒక్క రోజే ఇద్దరు మృతి చెందారు.

➡️