ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశం శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. హైదరాబాద్‌ మహా నగరంలో చోటు చేసుకున్న ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్యల పరిష్కారంతో పాటు ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై సమావేశంలో అధికారులు చర్చించనున్నారు.ఈ సమావేశానికి సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి , రాచకొండ సీపీ సుధీర్‌ బాబు, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దాన కిషోర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ , ట్రై కమిషనరేట్‌ పరిధిలోని జీహెచ్‌ఎంసీ అధికారులు, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి కలెక్టర్లతో పాటు ట్రాఫిక్‌, మెట్రో రైలు, జలమండలి, ఎలక్ట్రిసిటీ, హెచ్‌ఎండీఏ శాఖల అధికారులు, ఇతర శాఖలకు సంబంధించిన ఉన్నత అధికారులు హాజరయ్యారు.

➡️