బకాయిలు చెల్లించాలని పాడి రైతుల ఆందోళన

Mar 6,2024 17:11 #dairy farmers, #Dharna

హైదరాబాద్‌ : పాడి రైతులు ఆందోళన బాట పట్టారు. 50 రోజులుగా పాల బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ తార్నాకలోని విజయ డెయిరీ ఎదుట ఆందోళనకు దిగారు. పేరుకుపోయిన బాకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బిల్లులు సకాలంలో చెల్లించక పోవడంతో అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పాడి రైతులతో విజయ డైరీ ఎండీ చర్చలు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️