రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

Jan 28,2024 16:15 #road accident, #Telangana

ఆళ్ళపల్లి :చేపల మీద మక్కువ ఓ వ్యక్తికి ప్రాణాపాయంగా మారిన ఘటన ఆళ్ళపల్లి మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పైలట్‌ కథనం ప్రకారం.. ముత్తాపురం గ్రామానికి చెందిన పూసం సారయ్య ఆదివారం కాచనపల్లి గ్రామం చెరువులో చేపలు పడుతున్న విషయం ఇతరుల ద్వారా తెలుసుకుని అక్కడికి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. చేపలు కొన్నాక బైక్‌ పై తిరిగి వస్తుండగా కాచనపల్లి, అనంతోగు గ్రామాల మధ్య అడవిలో బైక్‌ అదుపుతప్పి ఓ చెట్టును ఢకొీట్టడంతో తీవ్ర గాయాలైన సారయ్య స్పృహ కోల్పోయాడు. అటుగా వెళ్తున్న ఓ బాటసారి ప్రమాదాన్ని చూసి 108కి సమాచారం ఇచ్చాడు. దాంతో ఆళ్ళపల్లి 108 వాహనం పైలట్‌ పరమ సునీల్‌ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడికి గాయాలు తీవ్రంగా ఉన్న విషయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్‌ నర్స్‌ సమ్మక్కకు చరవాణిలో తెలిపారు. ఆమె సూచనలతో కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందిస్తున్న అక్కడి వైద్యులు సారయ్యకు దవడ భాగంలో, ఎడమ భుజం భాగంలో తీవ్రంగా గాయాలైనట్లు వైద్యులు తెలినట్టు, మద్యం సైతం కొంత సేవించి ఉన్నట్టు పైలట్‌ సునీల్‌ సూచనప్రాయంగా వెల్లడించారు.

➡️