విశాఖకు రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ

Dec 12,2023 16:06 #adjournment, #AP High Court

అమరావతి: అమరావతి నుంచి విశాఖపట్నానికి క్యాంపు ఆఫీస్‌ల ముసుగులో రాజధాని తరలింపు పిటిషన్‌పై మంగళవారం ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రాజధాని ఆఫీసులు ప్రస్తుతం తరలించడం లేదని.. ఆఫీస్‌లు తరలిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమేనని హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌లో తెలిపింది. పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని రిజిస్ట్రీలో అప్లికేషన్‌ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని న్యాయవాది కోరారు. కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వం నుంచి.. స్పష్టత ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి సోమవారం ఆదేశించారు. ఆఫీస్‌లు తరలించడం లేదని హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం సమాచారమిచ్చింది. కేసు విచారణను వచ్చే సోమవారానికి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

➡️