విశాఖలో భూములు కొట్టేసేందుకే రాజధాని నాటకం : అచ్చెన్నాయుడు

Mar 5,2024 15:32 #achennaidu, #press meet

అమరావతి: ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయకుండా విశాఖలో భూములు కొట్టేసేందుకే రాజధాని నాటకానికి జగన్‌ రెడ్డి తెరలేపారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నిజంగా విశాఖ మీద అంత ప్రేమ ఉన్న జగన్‌ రెడ్డికి పరదాలు కట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బటులు లేనిదే అడుగులు కూడా వేయలేని జగన్‌ రెడ్డి ఎన్నికల వేల ఉత్తరాంధ్రపై ప్రేమ వెలగబోస్తున్నారన్నారు. ఓట్ల కోసం ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ లబ్ది పొందుతున్నారని విమమర్శించారు. ఉత్తరాంధ్ర జలవనరుల ప్రాజెక్టుల పూర్తి చేయడానికి ఇప్పటి వరకు వైసిపి కేవలం రూ.450 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కేంద్ర పర్యావరణ శాఖ వద్దని చెప్పినా వినకుండా రుషికొండను ఆక్రమించి కొండకు గుండు కొట్టి ప్యాలెస్‌లు నిర్మించుకున్నారని ఎద్దేవ చేశారు.

ఐదేళ్ల్లలో విశాఖకు ఒక్క కంపెనీ, ఒక్క పరిశ్రమను కూడా విశాఖకు తీసుకురాలేకపోయారన్నారు. అందరి ఆమోదంతో ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి ప్రపంచ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు నడుం బిగించారన్నారు. కాని జగన్‌ రెడ్డి కక్షపూరితంగా ప్రజారాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి రాష్ట్ర ప్రజల కలలను చెరిపేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ చిత్రపటం నుంచి రాజధానిగా అమరావతిని చెరిపేయటంతో పాటు 13 జిల్లాల అభివృద్ధిని కుంటుపడేలా చేశారని వివరించారు.ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడతాయని ఎన్నికల ముందు చెప్పిన జగన్‌ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక హోదాపై పోరాడకుండా తన కేసుల మాఫీ కోసం హోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ సమస్యను పక్కదారి పట్టించేందుకు విశాఖను రాజధానిగా ప్రకటించి ప్రజలను మభ్యకు గురి చేసే కుట్రకు జగన్‌ రెడ్డి తెరలేపారు.

➡️