వైసీపీకి రాజీనామా చేయనున్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే?

Feb 4,2024 19:05 #ex mla, #Resign To YCP

వినుకొండ :ఎన్నికల వేళ వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జున రావు పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన అనుచరులతో సమావేశమై.. ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎవరూ అధైర్యపడొద్దని, త్వరలో రాజకీయ భవిష్యత్‌ పై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.కాగా.. ఇప్పటికే కొందరు నేతలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఎన్నికల ముందు పార్టీలు మారడం లాంటివి పార్టీకి పెద్దదెబ్బ అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ తమ రాజకీయ భవిష్యత్‌ కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నేతలు చెబుతున్నారు.

➡️