సంగం డెయిరీలోకి వెళ్లేందుకు పోలీసుల యత్నం : అడ్డగించిన సిబ్బంది

Nov 24,2023 11:16 #Guntur District, #police, #sangam dairy

గుంటూరు : చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ లోనికి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు. తమకు రావల్సిన బకాయిలను అడగడానికి కొందరు రైతులు ఈ నెల 15వ తేదీన చేబ్రోలు మండలం వడ్లమూడిలోని డెయిరీ వద్దకు రాగా ఘర్షణ జరిగిందని, బాధితుల్లో ఒకరైన రాము ఫిర్యాదు మేరకు 15 మందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో…. శుక్రవారం ఉదయం సంగం డెయిరీలోని వెళ్లడానికి పోలీసులు యత్నించగా, అనుమతి లేకుండా వెళ్లనీయబోమని డెయిరీ భద్రతా సిబ్బంది పోలీసులను అడ్డగించారు. ఈనెల 15న జరిగిన ఘర్షణలో ధూళిపాళ్ల సహా మరికొందరిపై హత్యయత్నం కేసు నమోదైంది. దీనిపై విచారణ కోసం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురానికి చెందిన కొందరు రైతులు సంగం డెయిరీ ఆధ్వర్యంలోని పాల కేంద్రానికి పాలు సరఫరా చేశారు. దాని బకాయిలు అడిగేందుకు ఈనెల 15న(బుధవారం) వారు చేబ్రోలు మండలం వడ్లమూడిలోని డెయిరీ వద్దకు రాగా ఘర్షణ జరిగిందంటూ.. బాధితుల్లో ఒకరైన రాము ఫిర్యాదు మేరకు 15 మందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ధూళిపాళ్ల నరేంద్రను 14వ నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

➡️