సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన నళినికి పోలీస్‌శాఖలో తిరిగి అదే ఉద్యోగాన్ని ఇచ్చే అంశంపై గతంలో సీఎం రేవంత్‌ పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఆమెకు ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే తిరిగి తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించారు. పోలీస్‌ మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలు ఉంటే అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే శనివారం సచివాలయంలో రేవంత్‌ రెడ్డిని.. నళిని కలిసి మాట్లాడారు.

➡️