సిలిండర్లలో గంజాయి తరలింపు..

Feb 9,2024 15:16 #cylinders., #ganjai

హైదరాబాద్‌: ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి ఉత్తర ప్రదేశ్‌ కు ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్‌ సిలిండర్‌లలో గంజాయి నింపి తరలిస్తుండగా మేడ్చల్‌ నేషనల్‌ హైవేపై తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు. నలుగురు నిందితులు అభిషేక్‌ తోమర్‌, అరవింద్‌ చౌదరి, ఆశిష్‌ కుష్వాన, ఆకాష్‌ సోలంకిని అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గరి నుంచి 65 కేజీల గంజాయి, రెండు కార్లు, ఆరు సెల్‌ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 40 లక్షలు ఉంటుందని చెప్పారుపోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

➡️