సీఎం ఆటోడ్రైవర్లను ఆదుకోవాలి.. లేదంటే ప్రజా భవన్‌ ముట్టడిస్తాం..

Dec 15,2023 14:41 #auto drivers, #Dharna

తెలంగాణ: ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీస్‌ వల్ల ఆటో డ్రైవరలకు తీవ్ర నష్టం జరుగుతుందని బీఎంఎస్‌ ఆటో యూనియన్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 70 శాతం మహిళలు ఆటోల్లో ప్రయాణిస్తారని అన్నారు. అయితే.. గతంలో రోజుకు 1000 రూపాయలు ఆదాయం వస్తే.. ఇప్పుడు కనీసం 300 కూడా రావట్లేదని వాపోతున్నారు. ఉచిత ఆర్టీసీ సర్వీస్‌ స్కిం కు భారతీయ మజ్దూర్‌ సంఘం అద్వర్యంలో వరుసగా నిరసన కార్యక్రమలకు పిలుపునిస్తున్నామని అన్నారు. ఉచిత పథకాలతో ఆటో డ్రైవర్ల ఉపాధి పై ప్రభుత్వం దెబ్బ కొట్టద్దని తెలిపారు. ప్రభుత్వ అనుబంధ ఆఫీసుల్లో ఆటోలు పెట్టుకోవాలని.. లేదా బస్సుల సంఖ్య తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం రవాణా చట్టానికి విరుద్దంగా ఓల ఊబర్‌ సర్వీస్‌ లను తెచ్చిందని మండిపడ్డారు. తమ సమస్యల పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆటో డ్రైవర్ల తో చర్చలు జరపాలని తెలిపారు. లేదంటే ఈనెల 18న ధర్నాలు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు 19న వినతిపత్రాలు సమర్పిస్తామని అన్నారు. 20న ఆర్టీసీ డిపోల దగ్గర శాంతియుతంగా ఆందోళన చేపడతామని అన్నారు.21న, 22న ప్రజా సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు జరిపిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత పూర్తి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. సీఎం రేవంత్‌ రెడ్డి అయినా తమ సమస్యలను పరిస్కరించి ఆటో డ్రైవర్లకు తగిన సహాయం అందించాలని కోరారు. గత ప్రభుత్వం రవాణా చట్టం ప్రకారం ఓలా, ఉబర్‌, రాపిడ్‌ వైట్‌ ప్లేట్‌ బైక్‌ లకు అనుమతి ఇవ్వొద్దు అని చెప్పిన పట్టించుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. రాష్ట్రంలో 8లక్షల మంది ఆటో డ్రైవర్‌ లు ఉన్నారని.. వారి భవిష్యత్‌ అంధకారంలోకి వెళ్ళిందని వాపోతున్నారు. ఆటో సంఘాలతో చర్చలు జరపకపోతే ఛలో హైద్రాబాద్‌ కు పిలుపునిస్తామని, ప్రజా భవన్‌ ముట్టడిస్తామని అన్నారు. మరి ఆటో డ్రైవర్ల నష్టం పై సీఎం రేవంత్‌ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

➡️