1.44 లక్షల కోట్ల లోటు

Apr 4,2024 06:59 #AP Economy, #Revenue Deficit

2023-24 లోటు లెక్కలు ఖరారు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : 2023-24 ఆర్థిక సంవత్సరం భారీ లోటుతో ముగిసింది. ఈ గణాంకాల ప్రకారం సొంత ఆదాయానికి, వ్యయానికి మధ్య భారీ అంతరం నెలకొంది. సొరత పన్నుల ఆదాయం కన్నా వ్యయం 1.44 లక్షల కోట్లు ఎక్కువగా ఉంది. గత ఆదివారంతో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి 2.75 లక్షల కోట్లుతో బడ్జెట్‌ను ఆమోదించుకోగా, అందులో 1.02 లక్షల కోట్లు సొంత ఆదాయంగా వస్తుందని అంచనా వేశారు. అయితే కేవలం 85 వేల కోట్ల వరకు మాత్రమే ఆదాయం లభించినట్లు తేలింది. అయితే వ్యయం మాత్రం ఏకంగా 2.29 లక్షల కోట్లకు చేరింది. దీంతో మొత్తం లోటు 1.44 లక్షల కోట్లుగా నిర్ధారించారు.

రుణాలతోనే ఎక్కువగా భర్తీ
భారీగా నెలకొన్న ఈ లోటును ఎక్కువగా రుణాలతోనే భర్తీ చేశారు. ఇప్పటివరకు 67 వేల కోట్ల వరకు మార్కెట్‌ బారోయింగ్స్‌ ద్వారా సేకరించగా, ఇతర రంగాల నుంచి మరో పాతిక వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు తెలిసింది. ఇలా మొత్తం అంతరం 1.44 లక్షల కోట్లలో 75 నుంచి 75 శాతం వరకు రుణాలతోనే భర్తీ కావడం గమనార్హం.

➡️