బిఆర్‌ఎస్‌ సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగులపై వేటు

Apr 9,2024 14:46 #106 employees, #siddipeta, #suspended

సిద్దిపేట: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ బిఆర్‌ఎస్‌ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. మొత్తం 106 మందిని సస్పెండ్‌ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు.
ఈనెల 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో ఉపాధి హామీ, సెర్ప్‌ ఉద్యోగులతో మెదక్‌ లోక్‌సభ బిఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, మరికొందరు నాయకులు సమావేశం నిర్వహించారు. ఇది బహిర్గతం కావడంతో వెంకట్రామిరెడ్డి, రవీందర్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సమావేశంలో పాల్గన్న ఉద్యోగులను సీసీ టీవీ ఆధారంగా గుర్తించారు. సస్పెండైన వారిలో 38 మంది సెర్ప్‌ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు.

➡️