20 మంది వైసిపి నేతలకు గన్‌మెన్ల తొలగింపు

Feb 27,2024 18:05 #A key decision, #ap government

అమరావతి: కడప జిల్లాలో 20 మంది వైసిపి నేతలకు అనధికారికంగా ఇచ్చిన గన్‌మెన్‌లను ప్రభుత్వం తొలగించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే అంశంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఎన్నికల సంఘం (ఈసీ)కి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ వారికి 2+2 నుంచి 4+4 వరకు గన్‌మెన్‌లను కేటాయిస్తూ.. ప్రతిపక్షాలకు 1+1 మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందన్నాని చెప్పారు. దీన్ని సరిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

➡️