తొలిరోజు 236 నామినేషన్లు

Apr 19,2024 08:34 #2024 election, #nomination

అమరావతి బ్యూరో : తొలిరోజు 236 నామినేషన్లను స్వీకరించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మంగళగిరి నుంచి, కేంద్ర మాజీ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా) విజయవాడ పశ్చిమ నుంచి నామినేషన్లు వేశారు. పుంగనూరుకు చెందిన బిసివై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్‌ మంగళగిరి అసెంబ్లీ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. నెల్లిమర్ల నుంచి వైసిపి తరపున బడ్డుకొండ అప్పలనాయుడు, భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలో 25 ఎంపి స్థానాలకు 39 మంది అభ్యర్థులు 43 నామినేషన్లు దాఖలు చేశారు. టిడిపి నుంచి నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు, చిత్తూరు నుంచి దగ్గుమళ్ల ప్రసాదరావు, కర్నూలు నుంచి బసిపాటి నాగరాజు, కడప నుంచి చడిపిరాళ్ల భూపేష్‌ సుబ్బిరామిరెడ్డి, వైసిపి నుంచి రాజంపేట ఎంపి పివి మిథున్‌రెడ్డి, హిందూపురం నుంచి జోలదరాసి శాంత నామినేషన్లు వేశారు.

➡️