3 రాజధానుల శిబిరం ఎత్తేసి.. టిడిపిలో చేరిన వైసిపి నేతలు

Apr 3,2024 17:38 #join tdp, #Nara Lokesh, #TDP

ప్రజాశక్తి-అమరావతి: నాలుగేళ్లుగా మందడం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్ద 3 రాజధానుల శిబిరం నిర్వహిస్తున్న వైసిపి నేతలు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో లోకేష్ ను కలిసి టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు మాదిగాని గురునాథం మాట్లాడుతూ.. మూడు రాజధానులు, వికేంద్రీకరణ వల్ల లాభం జరుగుతుందని నమ్మి మోసపోయామన్నారు. అభివృద్ధి, వికేంద్రీకరణ తెలుగుదేశం కూటమితోనే సాధ్యమని ఆలస్యంగా గ్రహించామన్నారు. టిడిపిలో చేరిన వారిలో ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ సెల్ మాజీ అధ్యక్షుడు సంకే విశ్వనాథ్, యునైటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అప్పికట్ల జవహర్ తదితరులు టిడిపిలో చేరిన వారిలో ఉన్నారు.

➡️