అక్రమంగా తరలిస్తున్న 4 వేల లీటర్ల మద్యం సీజ్‌..

హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో పోలీసులు విస్త్రుతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో పెద్దఎత్తున అక్రమ మద్యం, నగదు పట్టుబడుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అన్ని ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బాచుపల్లి, పేట్‌ బషీరాబాద్‌ పోలీస్టేషన్ల పరిధి దాదాపు 4 వేల లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశారు. దీని విలువ రూ.37 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా తరలిస్తున్న రూ.21.53 వేల విలువగల 2597.88 లీటర్ల మద్యం పట్టుబడింది. పేట్‌ బషీరాబాద్‌ పీఎస్‌ ప్రాంతంలో రూ.15.46 విలువగల 1916.2 లీటర్ల మద్యం, అదేవిధంగా రేడియంట్‌ మనీ లాజిస్టిక్‌ వాహనంలో ఎలాంటి క్యూఆర్‌ కోడ్‌ లేకుండా తరలిస్తున్న రూ.1,24,626 నగదును బాలానగర్‌ ఎస్‌వోటీ టీం, కేపీహెచ్‌బీ పోలీసులు సంయుక్తంగా పోలీసులు పట్టుకున్నారు.

➡️