Fire – నెల్లూరులోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తహాలు వెనుక ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగి శ్రీరామ్‌ చిట్‌ ఫండ్‌ కంపెనీ కార్యాలయంలో మొదటిగా మంటలు వ్యాపించాయి. ఆ తరువాత కింది అంతస్థులో ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలోకి మంటలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. శ్రీరామ్‌ చిట్‌ ఫండ్‌ కార్యాలయంలో షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగాయని ప్రాథమిక అంచనా వేశారు. అయితే అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణ కొనసాగుతోంది.

➡️