తెలంగాణలో మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన

తెలంగాణ : పెండింగ్‌ జీతాలను చెల్లించాలంటూ … తెలంగాణలోని మధ్యాహ్న భోజన కార్మికులు శుక్రవారం ప్రజాభవన్‌ వద్ద నిరసన చేపట్టారు. ఈరోజు ఉదయం ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అదే సమయంలో … పలు జిల్లాలకు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు అక్కడకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి నెల 10వ తేదీలోపు మెస్‌ బిల్లులు, జీతాలు చెల్లించాలని నినాదాలు చేశారు. పెంచిన రూ.3 వేల జీతాన్ని వెంటనే ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. జిఒ 46ను రద్దు చేయాలని నిరుద్యోగులు ప్రజాభవన్‌కు తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు తగు చర్యలు చేపట్టారు.

➡️