6thDay: వినూత్నంగా అంగన్వాడీల సమ్మె

Dec 17,2023 17:10 #Anganwadi strike, #continues, #Six

అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … అంగన్వాడీలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె ఆదివారంతో ఆరో రోజుకు చేరింది.

annamayya aganwadi workers strike 6th day.jpg
అన్నమయ్య-రాజంపేట అర్బన్ : అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు ఆదివారం రాజంపేటలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల పోరాటాలకు మద్దతుగా పాల్గొంటు అమరుడైన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ అంగన్వాడిల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించి పరి‍ష్కరించాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కల్పించుకొని సమస్యలు పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు కనీస వేతనం రూ 26000 వేలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెన్షన్ సౌకర్యాలు, పధకాలను అందించాలని, అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు హరి ప్రసాద్, సీనియర్ నాయకులు నాగేశ్వర గౌడ్, రాష్ట్ర కౌన్సిలర్ చెంగల్ రాజు, జిల్లా కార్యదర్శి వెంకటసుబ్బయ్య , రాజంపేట, పెనగలూరు, నందలూరు, పుల్లంపేట, చిట్వేలి మండలాల నాయకులు నాగేంద్ర, శివయ్య, పాపయ్య, సతీష్, నరసింహారావు, రఫీ, రమేష్, హరినాథ్, పిచ్చయ్య, శివ కుమార్, రవి, యు.వెంకట సుబ్బయ్య, రవిచంద్ర, విశ్వనాథ్, వీరయ్య, శ్రీనివాసులు, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

kurnool aganwadi workers strike 6th day
అంగ‌న్‌వాడీల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి
కర్నూల్ – ఆదోని : అంగ‌న్‌వాడీల న్యాయ‌మైన స‌మ‌స్య‌లు వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని యుటిఎఫ్ జిల్లా స‌హాధ్య‌క్షురాలు బి జీవిత, ఆడిట్ సభ్యులు వై రామాంజనేయులు కోరారు. ఆదివారం ఆదోనిలోని శ్రీ‌నివాస స‌ర్కిల్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద చేప‌ట్టిన 6వ రోజు స‌మ్మెకు యుటిఎఫ్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీల‌ సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిస్కరించేంతవరకు ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు కె రుద్రముని, ఆవుల బసప్ప, చాట్ల బాబు, యల్ కె బసప్ప, వై నారాయణ, సి హెచ్ పెద్దయ్య, పి రంగ నాయకులు, నాగేష్, రాముడు, ఉరుకుందయ్య పాల్గొన్నారు

sklm aganwadi workers strike 6th day sompeta
శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలు


చిత్తూరు జిల్లా కార్వేటినగరంలోని అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు కుమారగిరిపై వెలసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మెట్ల మీదుగా ఆలయానికి చేరుకొని నిరసన తెలిపిన అంగన్వాడీ కార్యకర్తలు

kkd aganwadi workers strike 6th day kajuluru
అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యం తగదు
కాకినాడ – కాజులూరు : అంగన్వాడీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగ్గదని జిల్లా కౌలు రైతుల సంఘం కార్యదర్శి వల్లు రాజబాబు అన్నారు.సమస్యల పరిష్కారం కొరకు అంగనవాడి సమ్మెలో భాగంగా ఆదివారం మండల కేంద్రమైన కాజులూరు పంచాయతీ వద్ద ఆరవ రోజుకు చేరిన సమ్మెను ఉద్దేశించి ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లి రాజబాబు మాట్లాడుతూ అంగన్వాడిల సమస్యల పరిష్కరించకుండా ప్రభుత్వం కవ్వింపు చర్యలకు దిగటం చాలా దుర్మార్గమని అన్నారు.సమస్యలు పరిష్కారం అయ్యేవరకు కనీస వేతనం పెంచే వరకు ఈ నిరసన కొనసాగించాలని సంఘం పిలుపుకు అంగన్వాడీలంతా సిద్ధంగా ఉండాలని ఐక్యంగా ప్రభుత్వ తీరును నిరసించాలని ఒకసారి చర్చలు జరిగినప్పటికీ ప్రభుత్వం దిగిరాని కారణంగా సమ్మె ఇంకా కొనసాగించాలని అనేక రూపాల్లో దశల వారి ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో గొల్లపాలెం కాజులూరు కోలంక సెక్టార్ లీడర్లు వరలక్ష్మి, హనుమామతి, అన్నవరం, మామిడి ప్రసన్న, జొన్నలగడ్డ సరోజినీ, సలాది లక్ష్మి, నందికోళ్ల నాగమణి,శేషారత్నం తదితరులు పాల్గొన్నారు.

kkd aganwadi workers strike 6th day
అంగన్వాడీల సమ్మెకు అంగన్వాడి లబ్ధిదారులు మద్దతు
కాకినాడ – పెద్దాపురం : తమ సమస్యల పరిష్కారం కోసం, వేతనాల పెంపుదల కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఆదివారం 6వ రోజుకు చేరుకుంది. అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సిఐటియు)ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్దకు అంగన్వాడి కేంద్రాల నుండి సేవలు పొందుతున్న లబ్ధిదారులు వచ్చి అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగనవాడి కేంద్రాల ద్వారా తాము ఎన్నో సేవలు పొందుతున్నామన్నారు. వారి సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు దాడి బేబీ మాట్లాడుతూ ఆరు రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు సరి కదా నిర్బంధాలను ప్రయోగించి అణచాలని చూస్తుందన్నారు. వేతనాలు పెంచాలని,గ్రాడ్యుటి అమలు చేయాలని, అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించాలని కోరుతుంటే ప్రభుత్వం నుండి కనీస స్పందన కూడా లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. సమ్మె శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపిన తల్లులకు, మహిళలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమల, ఎస్తేరు రాణి, నాగమణి, వరలక్ష్మి, ఫాతిమా, కుమారి, స్నేహా, వనకుమారి, వసంత, లోవ కుమారి, లలిత, స్నేహలత, టీ యల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

bapatla aganwadi workers strike 6th day chirala

జగన్ మామయ్య మా టీచర్ జీతాలు పెంచండి
– చిన్నారులు పలకలతో వినూత్న నిరసన
– మద్దతునిచ్చిన చిన్నారులు, తల్లిదండ్రులు

బాపట్ల – చీరాల : జగన్ మామయ్య… మా టీచర్ల జీతాలు పెంచాలి.. అంటూ అంగన్వాడీ కేంద్రాల చిన్నారులు తమ టీచర్లు చేస్తున్న న్యాయమైన సమస్యల పరిష్కారానికి మద్దతునిచ్చారు. తమ టీచర్లే తమకు కావాలని, అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టవద్దు అంటూ పలకలపై రాసుకొని నిరసన తెలియజేశారు. ఆదివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసన దీక్షలు ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన దీక్షలో పాల్గొని వారికి మద్దతునిచ్చారు. ఈ సందర్భంగా అంగనవాడి హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ ఎలిజిబెత్ మాట్లాడుతూ అంగనవాడి కార్యకర్తలు శాంతియుతంగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వం వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టడం శోచనీయం అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచాలని, గ్రాడ్యుటిని అమలు చేయాలని, డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎప్పటికైనా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అన్నారు. తమ సమ్మెకు అందరూ మద్దతు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. తమ సమస్యలను విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు, పార్టీ నేతలు అందరూ గమనిస్తూ మద్దతుగా నిలిచారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మొండి వైఖరి అవలంబిస్తూ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుంది అన్నారు. తమ డిమాండ్స్ పరిష్కారం అయ్యేవరకు సమ్మెని చేస్తామన్నారు. కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు,ఎన్ బాబురావు, జీ సుజీవన, జ్యోతి, అరుణ, ప్రసన్న కుమారి, లత, సులోచన తదితరులు పాల్గొన్నారు.

bapatla aganwadi workers strike 6th day

బాపట్ల-నిజాంపట్నం : అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ధమనకాండని నిరసిస్తూ మెడకి ఉరితాళ్లతో నిరసన.. మండల కేంద్రంలో ఆరో రోజు జరుగుతున్న సమ్మెలో భాగంగా సమ్మె శిబిరంలో ఉరితాళ్లు వేలాడదీసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నిజాంపట్నం మండలంసిఐటియు నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లను రాష్ట్రవ్యాప్తంగా భయభ్రాంతులను గురి చేసేలాగా అంగన్వాడి సెంటర్లను ఇతర శాఖలో రెవెన్యూ, ఎంపీడీవో, సచివాలయం ఐసిడిఎస్, ఐకెపి, వాలంటీర్ల ద్వారా తాళాలు పగలగొడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలు అడిగేది కేవలం న్యాయబద్ధమైన డిమాండ్ పెరుగుతున్న ధరల్లో భాగంగా పనిచేసిన దానికి కనీస వేతనం, రిటైర్డ్ అయిన తర్వాత బతకడానికి రిటైర్మెంట్ బెనిఫిట్, పెన్షన్ ప్రభుత్వం వీటిని అమలుచేయకుండా సంవత్సరాల తరబడి మోసం చేస్తుందని పోరాటం తప్ప మరో మార్గం లేదని సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు ఎన్.శివశంకర్, ఏపీ అంగన్వాడి హెల్పర్స్, వర్కర్స్ సీఐటీయూ యూనియన్ నాయకులు ఉష,గాయత్రి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

challapalli aganwadi workers strike 6th day
కృష్ణా జిల్లా చల్లపల్లిలో చెవిలో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు

tirupati aganwadi workers strike 6th day
6వ రోజుకు చేరుకున్న అంగన్వాడి కార్యకర్తల నిరవధిక సమ్మె తిరుపతి జిల్లా గూడూరులో నిరవధిక సమ్మె సిబిరంలో ఉభయగోదావరి జిల్లాల ఉద్యోగ, ఉపాధ్యాయ నేత ఎమ్మెల్సీ షేక్ సాబ్జికి అంగన్వాడీ కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి రెండు నిమిషాలు మౌనం పాటించిన అంగన్వాడి కార్యకర్తలు, సిఐటియు నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు.

alluri aganwadi workers strike 6th day vrpurams
అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్ పురం అంగనవాడి ల ఆందోళన, మండల కేంద్రంలో రేఖపల్లి జంక్షన్ లో 6వ రోజుకు అంగన్వాడీల ఆందోళన కొనసాగింది అంగన్వాడీ ల సమస్యలు రాష్ట్రప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నినాదాలతో దద్దరిలించారు. అధ్యక్షురాలు నాగమణి కార్యదర్శి రాజేశ్వరి నాయకత్వంలో ఆందోళన కొనసాగుతుంది.

alluri aganwadi workers strike 6th day
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండల కేంద్రంలో అంగన్వాడి వర్కర్ల యొక్క న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత 6 రోజులుగా సమ్మె జరుగుతుంది ఈ సందర్భంగా సిఐటియు అల్లూరి జిల్లా ఉపాధ్యక్షులు బొండా సన్నిబాబు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకుండా. గ్రామాల్లో ఉన్నటువంటి అంగన్వాడి సెంటర్లను సచివాలయం సిబ్బంది, వాలంటార్లు, స్థానిక ఎంపీడీవో, సిడిపివోలు అంగన్వాడి సెంటర్ల తాళలు బద్దలు కొట్టి నిర్బంధం ప్రయోగించాలని ఒక ప్రయత్నం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో జరిగే ఎన్నికల్లో ఘోర పరజయానికి సరిచూడాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానని ఆనాడు ప్రకటించి ఈరోజు సమస్యలు పరిష్కారం చేయకుండా అంగన్వాడి వర్కర్లు సమస్యలు పరిష్కారం చేయాలని ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను నిర్బంధాలకు గురిచేసి సమస్యలు పరిష్కారం చేరకుండా మొండిగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడి యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని, ఈ సందర్భంగా ప్రభుత్వం నికి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సాగిన ధర్మానపడాల్ సిఐటియు పూర్వ మండల కార్యదర్శి, బొండా గంగాధరం అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు టి రాజమ్మ ఎస్ సుశీల ,మంగమ్మ ,శాంతి, కొండమ్మ, కుర్ర దేవి పార్వతి వరహాలమ్మ అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

eluru aganwadi workers strike 6th day

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం : మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, మినీ వర్కర్స్ సమ్మె అరో రోజుకు చేరుకుంది. ఆరో రోజు నిరసనలో వినూత్నంగా గాంధీ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని, ఈ ప్రభుత్వం చేసే అన్యాయం చూడకు, సాధించే వరకు సాగు, ఈ ప్రభుత్వం చెప్పే అసత్యాలు నమ్మకు గెలిచే వరకు పోరాటం ఆపకు, ఆరు రోజులు నుంచి చేస్తున్న, పట్టించుకోని ప్రభుత్వం గురించి మౌనంగానే ప్రశ్నించు అని నినదించారు. ప్రాజెక్ట్ అధ్యక్షులు శివ రత్న కుమురి, పి పద్మజ, జె నాగవేని, అడపా నాగజ్యోతి, సి.హెచ్ సునితరయల్, బొబ్బిలి చిట్టి, కే జ్యోతి, కే మాధవి, పి భాగ్యలక్ష్మి, యమ్ వెంకటలక్ష్మి, యమ్ మంగా,శ్రీదేవి, నుర్జాహన్ తదితరులు పాల్గొన్నారు.

vzm aganwadi workers strike 6th day c

తప్పుడు ప్రకటనలతో లబ్ధిదారులను గందరగోళం గురించి చేయొద్దని ప్రభుత్వానికి హితవు .

vzm aganwadi workers strike 6th day
విజయనగరం జిల్లా అంగన్వాడి సమ్మె పోరాటాన్ని లబ్ధిదారుల మద్దతు ఉదృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్, రామ్మూర్తి నాయుడు రాజాం, కాకర్ల వీధి అంగన్వాడి కేంద్రం పరిధిలో ఉన్న లబ్ధిదారుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉమా కుమారి అధ్యక్షతన కాకర్ల వీధిలో జరిగిన లబ్ధిదారుల సమావేశంలో రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలుతమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తుంటే సమ్మెను విచ్చన్నం చేసేందుకు అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా తీర్పిస్తున్న పరిస్థితి ఉందని, లబ్ధిదారులుగా ఈ రకమైనటువంటి పద్ధతులను ఎదుర్కొని అడ్డుకోవాలని కోరారు. అనేక సంవత్సరాలుగా గర్భిణీలకు బాలింతలకు ప్రీస్కూల్ పిల్లలకు అనేక రకాల సేవలు చేస్తున్న అంగన్వాడీలు తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించమని అడిగితే ప్రభుత్వము నిర్బంధం ప్రయోగిస్తుందని, అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేస్తుందని తెలిపారు. మరోపక్క అంగన్వాడీ కేంద్రాలకు ఆహార నాణ్యతను పెంచాలని ఇస్తున్నటువంటి సరుకులు పెంపుదల చేయాలని, ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంపుదల చేసి పటిష్టంగా నడపాలని ఆ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన జరగడం లేదని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న చట్ట వ్యతిరేక చర్యలను లబ్ధిదారులు గమనించాలని అంగన్వాడీలకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు 1.అంగన్వాడీలను తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి.

atp aganwadi workers strike 6th day sa
ఈ రోజు మా పిల్లలతో వచ్చాం… రేపు మా కుటుంబంతో వస్తాం…

atp aganwadi workers strike 6th day hindupuram
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో అంగన్వాడీల వినూత్న నిరసన…
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమ్మెపై మొండి వైఖరి మానుకొని, తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన సమ్మె 6వ రోజుకు చేరింది. ఆదివారం అంగన్వాడీలు వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలోని ఇందిరా పార్క్ నుంచి అంగన్వాడీలు అందరూ పట్టణంలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ సర్కిల్ లో మానవహారంగా ఏర్పడి, గడ్డి తింటూ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీలు చేపట్టిన ర్యాలీకి వారి చిన్నారులు సైతం మద్దతు పలికి జగన్ మామ…. మా అమ్మలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి అంటుంది నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తహసిల్దార్ కార్యాలయం ముందు వినూత్నంగా సోది చెబుతామమ్మ సోది అంటూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జగన్కు సోది చెప్పి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఉషారాణి, ప్రాజెక్టు కార్యదర్శి లావణ్య, నాయకులు శిరీష, శైలజ, నాగమ్మ, రిహానా, సుమియ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మండల కేంద్రం కొల్లిపరలో సిపిఎం సీనియర్ నాయకులు ములక శివ sambireddy ఆధ్వర్యంలో శిబిరం లోమోకాళ్లపై కూర్చుని తమ నిరసనను తెలిపారు
మండల కేంద్రం కొల్లిపరలో సిపిఎం సీనియర్ నాయకులు ములక శివ sambireddy ఆధ్వర్యంలో శిబిరం లోమోకాళ్లపై కూర్చుని తమ నిరసనను తెలిపారు
లేపాక్షి , కంచిసముద్ర,పంచాయతీ అంగన్వాడి కేంద్రం ముందు చిన్నారులు, లబ్ధిదారులతో అంగన్వాడి వర్కర్ సమస్యల పరిష్కరించాలని ధర్నా నిర్వహించడం జరిగింది.
లేపాక్షి , కంచిసముద్ర,పంచాయతీ అంగన్వాడి కేంద్రం ముందు చిన్నారులు, లబ్ధిదారులతో అంగన్వాడి వర్కర్ సమస్యల పరిష్కరించాలని ధర్నా నిర్వహించడం జరిగింది.
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం.....అంగన్వాడీల వినూత్న నిరసన...
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం…..అంగన్వాడీల వినూత్న నిరసన…
తాల్లారేవు అంగన్వాడీ లకు మద్దతు గా పిల్లల తల్లులు.
తాల్లారేవు అంగన్వాడీ లకు మద్దతు గా పిల్లల తల్లులు.
బాపట్లలో ఆకులు తింటూ అంగన్వాడీల నిరసన
బాపట్లలో ఆకులు తింటూ అంగన్వాడీల నిరసన
➡️