అంగన్వాడీ సమ్మె: కోటి సంతకాల సేకరణ

anganwadi workers strike 32nd day signature campaign

ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం  ‘జగనన్నకు చెబుదాం..’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. అనేక జిల్లాలో దీక్షా శిబిరాల వద్ద సంతకాల సేకరణను చేపట్టారు. అంగన్వాడీల రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా 32వ రోజు శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ప్రముఖ వైద్యులు రావి గోపాలకృష్ణయ్య కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఎస్మా నోటీసులను భోగి మంటల్లో వేసి తగులబెట్టారు. సంక్రాంతిలోపు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని తెలిపారు. పది సమస్యలు పరిష్కరించామని చెబుతున్నారని, వాటికి సంబంధించి కొన్ని జిఓలు ఇంతవరకు ఇవ్వలేదని పేర్కొన్నారు. శుక్రవారం చర్చలు జరుపుతామని ఆహ్వానించి మరోవైపు షోకాజు నోటీసులు ఇస్తున్నారని, అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఇంటికి వచ్చి ఇళ్లలో వారిని నిద్రలేపి ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు.

 

anganwadi workers strike 32nd day in number

 

anganwadi workers strike 32nd day in konaseema

  • పిండి వంటలతో నిరసన 

డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ – రామచంద్రపురం : జీతాలు పెంచాలంటూ అంగన్వాడి వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 32 రోజుకు చేరుకుంది. రామచంద్రపురం కే గంగవరం మండలాలకు చెందిన సుమారు నాలుగు వందలు మంది అంగన్వాడి వర్కర్ల సేవలో పాల్గొన్నారు సంక్రాంతి పండగను పురస్కరించుకుని మహిళలంతా మెయిన్ రోడ్లపై పిండి వంటలు తయారు చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం మండవయకర్ విడనాడాలని అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం అంగన్వాడి వర్కర్ల కార్యదర్శి ఎం దుర్గమ్మ వరలక్ష్మి జహిరా, దేవి తదితరులు సమ్మెను ఉద్దేశించి ప్రసంగించారు. చర్చలు సఫలం కాకపోతే సమ్మెను మరింతకాలం కొనసాగిస్తామని సందర్భంగా వారు తెలిపారు.

anganwadi workers strike 32nd day in ntr

తీరు మారకపోతే తగిన ఉద్యమం ఉధృతం చేస్తాం

ఎన్టీఆర్ – మైలవరం : స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ 32వ రోజు సమ్మెను కొనసాగిస్తూ నిరసన దీక్ష చేసినారు.ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ సిపిఎం పార్టీ మండల నాయకులు ఆర్ రమేష్ బాబు, సీఐటీయూ మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్, మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్స్ తో వెట్టి చాకిరి చేపిస్తూ వేతనాలు అడిగితే అరెస్టులు చేస్తూ, బెదిరింపులకు దిగుతూ, తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని వారన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే తెలంగాణ కన్నా ఎక్కువ వేతనాలు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు మారకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి కొండూరు మండల కార్యదర్శి కే బాలకృష్ణ, అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ నాయకులు ఆర్ఆర్వి పుష్పకుమారి, సిహెచ్ శారద, బుల్లెమ్మ ,రబ్బాని ,మాణిక్యం, విజయలక్ష్మి, నిర్మల, తదితరులు పాల్గొన్నారు.

anganwadi workers strike 32nd day in tpt

భోగిమంటలో ఏస్మా జీవో, సోకాసు నోటీసులు దగ్ధం

తిరుపతి – పుత్తూరు టౌన్ : పట్టణంలోని తాసిల్దార్ ఆఫీస్ ఎదురుగా 32వ రోజు అంగన్వాడి వర్కర్స్ సమ్మె సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి ఎస్మా జీవోను, సోకాస్ నోటీసులను దగ్ధం చేయడం జరిగినది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను అణిచివేయడానికి శోకాసు నోటీసులు జీవను తీసుకొచ్చి నిర్బంధించడం సరైన పద్ధతి కాదన్నారు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు చిన్నపిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు శిశు సంక్షేమ శాఖ ద్వారా ఆమె ఎంతో సమకూర్చి సేవలు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్ములను గుర్తించకుండా వీధిపాలు చేయడం దారుణమన్నారు అనంతరం భోగి చుట్టూ అంగన్వాడి వర్కర్స్ గొబ్బిలి తట్టి నిరసన వ్యక్తం చేశారు ముగ్గులు వేయడం జరిగినది ఈరోజు జరుగుతున్న చర్చల్లో అంగన్వాడి వర్కర్లకు సానుకూల చర్చలు జరిపి వేతనాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో దళిత గిరిజన సంఘ జిల్లా కార్యదర్శి వై నందయ్య, యూనియన్ నాయకులు ముని కుమారి, విజయ్ కుమారి, ధనమ్మ, రాధా, పద్మజ, లలిత, అన్నపూర్ణ, మోహన్ లక్ష్మి, హైమావతి , గంగులమ్మ, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.

anganwadi workers strike 32nd day in knl

  • బెదిరింపులు పాల్పడడం చేతగానితనం

మంత్రాలయం(కర్నూల్) :  అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా బెదిరింపులకు పాల్పడడం ప్రభుత్వం చేతగానితనంగా చెప్పవచ్చునని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి రామాంజనేయులు అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 32 వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుండా బెదిరించడం భయాందోళనలకు గురిచేయడం సరైనది కాదన్నారు. తక్షణమే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించి అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఐ సి డి ఎస్ కార్యాలయం వద్ద నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి రాఘవేంద్ర స్వామి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరిస్తూ తక్షణమే మా సమస్యలు పరిష్కరించేటట్లు ముఖ్యమంత్రి కి మంచి బుద్ధిని ప్రసాదించాలని అంగన్వాడిలు ప్రార్థించారు. కనీస వేతనం 26,000 /-వేలు గ్రాడ్యుటిని ఇచ్చే విధంగా చూడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి హెచ్ జయరాజూ నాయకులు ప్రాణేష్ మంత్రాలయం ప్రాజెక్టు అధ్యక్షులు విశాలాక్షి ఉపాధ్యక్షులు ప్రమీల ద్రాక్షాయని ఉమామహేశ్వరి సుజాత లావణ్య తదితరులు పాల్గొన్నారు.

anganwadi workers strike 32nd day in kkd

కోటి సంతకాలకు అంగన్వాడీల పిలుపు

  •  ప్రారంభించిన చిరంజీవిని కుమారి
    వేతనం పెంచేవరకు పోరాడతాం అంగన్వాడీలు

కాకినాడ : అంగన్వాడీ డిమాండ్లపై ప్రజల మద్దతు కోరుతూ కోటి సంతకాల సేకరణకు ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడంతో కాకినాడ జిల్లా 24గంటల రిలే నిరాహార దీక్షల శిబిరంలో సంతకాల కార్యక్రమాన్ని ఐడియల్ కాలేజీ కరస్పాండెన్స్ చిరంజీవిని కుమారి మొదటి సంతకం చేసి ప్రారంభించి మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యమం విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత మార్గంలో అంగన్వాడీలు చాలా పట్టుదలతో నెలరోజుల నుండి నిర్వహిస్తున్న ఉద్యమాన్ని కొనియాడారు. మీరు మహిళలు కాదు, మహాశక్తివంతులని నిరూపిస్తూన్నారన్నారు. ఈ ఉద్యమం వర్గ పోరాటాలకు సారధ్యం వహిస్తుందని, భవిష్యత్తు ఉద్యమాలను ఎలా నిర్వహించాలో స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సదేహంలేదన్నారు. ధరల పెరుగుదలతో, చాలీచాలని వేతనాలతో సతమతమవుతున్న సామాన్య ప్రజానీకమంతా అంగన్వాడీ పోరాటానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షా శిబిరానికి కాకినాడ రూరల్, అర్బన్ అంగన్వాడి ప్రాజెక్టు నాయకులు వీరమణి, సరోజిని, చామంతి, విజయ, సుధా, భవాని, సునీత, సుజాత, జోగమ్మ, వరలక్ష్మి, వ్యాపారమ్మ, రాధా, సునీత, సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరానికి సమగ్రశిక్షా ఉద్యోగుల జేఏసీ నాయకులు మహాలక్ష్మి, రాజు, గంగాధర్, సత్యనాగమణి, కిరణ్, చంటిబాబు .ఐద్వా నాయకులు భవాని, చెక్క రమణి, జనవిజ్ఞాన వేదిక నాయకులు కె.ఎం.ఎం.ఆర్. ప్రసాద్, వర్మ, రిటైర్ అంగన్వాడీ టీచర్ వరహాలక్ష్మి ఆర్ధిక సహాయం చేసి మద్దతు తెలియజేసారు.

anganwadi workers strike 32nd day in wg

పెంటపాడు :
అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమ్మె 32వ రోజుకి చేరింది ఈరోజు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం చర్చలు సందర్భంగా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి జీతాలు పెంచాలి గ్రాడ్యూటీ అమలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమ్మె 32 రోజు చేరుకుంది. ఈరోజు అంగన్వాడి సమ్మె శిబిరం వద్ద సంతకాల సేకరణ అలాగే ముగ్గులు వేసి నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ అంగన్వాడి నాయకులు జై శ్యామల కుమారి ఆర్ అనురాధ వి కనకమహాలక్ష్మి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు మాట్లాడుతూ దఫదపాలుగా ఆందోళన పోరాటాలు నివర్తించారు కానీ ప్రభుత్వం అంగన్వాడి సమస్యలు పరిష్కరించకుండా మంత్రులతో నాలుగుసార్లు చర్చలు జరిపిన కనీస వేతనం గురించి గ్రాడ్యూటీ గురించి మాట్లాడకుండా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా మహిళలను 32 రోజులు నుంచి సమ్మె చేస్తున్న మహిళలను గుర్తించకుండా మహిళలు సమస్యలు పరిశీలించకుండా ఒకపక్క కరెంటు చార్జీలు పెరుగుతున్న ప్రజలపై పెనుబారాల పడుతుంటే ప్రభుత్వం ఆలోచించకుండా నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దాన్ని గుర్తించకుండా అంగన్వాడి సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తే అంగన్వాడి కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం ప్రజా సమస్యలపై ఆలోచించి చర్చించి తక్షణమే పరీక్షించాలని లేనియెడల ప్రభుత్వానికి తగు మూల్యం చెల్లించాల్సి వస్తాదని హెచ్చరించారు. కనీస వేతనం 26000 ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలి. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్చల సందర్భంగా సమస్యలు పరిష్కరించకుండా పండుగలు కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించి పరిష్కరించాలని కోరారు. కాలయాపన చేస్తే పెద్ద ఎత్తున ప్రభుత్వం మొండి వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే రెండు నెలల్లో ఎన్నికల్లో ప్రభుత్వాన్ని దించే పరిస్థితి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలోజి జయలక్ష్మి సిహెచ్ శ్రీదేవి హైమ వెంకటలక్ష్మి నాగమణి శిరీష మంగతాయారు. అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ పెనగంటి దుర్గా తదితరులు పాల్గొన్నారు.

. anganwadi workers strike 32nd day in eg

32వ రోజుకి చేరిన అంగన్వాడీలు నిరవధిక సమ్మె

తూర్పు గోదావరి జిల్లా –  చాగల్లు : మండల కేంద్రమైన చాగల్లు  తహశీల్దార్ కార్యాలయం సమీపంలో నిర్వహిస్తున్న అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీలు సమస్యలుపై చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాటి కి 32వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు పి విజయ కుమారి కె లక్ష్మి  మాట్లాడుతూ మేము చేస్తున్న నిరవధిక సమ్మె న్యాయమైనవని సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అడుగుతున్నాం తప్ప మేము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. ముఖ్యంగా ఆర్థికపరమైన జీతాల పెంపు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుట్ అమలు, పెంక్షన్ ఇవ్వాలని, రిటైర్డ్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని తదితర డిమాండ్స్ అమలు చేయాలని కోరుతున్నాం అన్నారు. దీర్ఘకాలంగా ఎంతో సేవ చేస్తున్న మమ్ములను ప్రక్కన పెట్టి, నోటీసులు ఇచ్చి భయభ్రాంతులను చేయడం దారుణమన్నారు. ఇచ్చిన కోర్కెలు తీర్చకుండా అంగవాడీలుపై ఎస్మా ప్రయోగించడం, చాలా బాధాకరం అన్నారు ఇప్పటికైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించి న్యాయపరమైన కోర్కెలను తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.

సామూహిక ఉరి, ప్రార్ధనలతో అంగన్వాడీల నిరసన

తూర్పు గోదావరి జిల్లా – ఉండ్రాజవరం: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకు సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీలు 32వ రోజైన శుక్రవారం ఉదయం ప్రభువుకు ప్రార్థనలు, అనంతరం తూర్పుగోదావరి జిల్లా, పెరవలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు ఆధ్వర్యంలో సామూహిక ఉరి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా అంగన్వాడీలు తమ మెడలకు ఉరితాడు తగిలించుకుని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ రంగనాయకమ్మ, వి లక్ష్మి, కెఎంఎస్ ప్రసన్న కుమారి, రత్నకుమారి, సిహెచ్ జ్యోతి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

anganwadi workers strike 32nd day in wg

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం : తమ డిమాండ్లను ముగ్గులు రూపంలో తెలుపుతూ నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో అంగన్వాడీల నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు జరిగే చర్చలు కావాలంటూ భగవంతుని ప్రార్థిస్తున్నారు.

anganwadi workers strike 32nd day in vzm

విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేసి ఇతర సౌకర్యాలు కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్.రామ్మూర్తి నాయుడు రాజాం తాసిల్దార్ కార్యాలయం వద్ద జరుగుతున్న 32వ రోజు రిలే నిరాహార దీక్షలో డిమాండ్ చేశారు. రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటంపై ముందు పట్టుదలతో కక్ష సాధింపు దూరంలో వ్యవహరించడం సరైనది కాదని, తేగే వరకు లాక్కుండా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగితే ఈ రకంగా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ఆలోచన సరైంది కాదని, ప్రభుత్వం ఎన్ని రకాల నిర్బంధాల్ని, బెదిరింపుల్ని చేస్తున్న వాటిని ఎదుర్కొని అంగన్వాడీలు ఈరోజు సమ్మెలో నిలబడడం గర్వకారణమని ప్రభుత్వం గుర్తించి వెంటనే సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పిచుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లుగా అంగన్వాడీపై ఎస్మా ప్రయోగించడం కూడా అంతేనని, గత 30-40 ఏళ్లుగా ఐసిడిఎస్ లో సేవలందిస్తున్న అంగనవాడిలకు కనీస వేతనాలు గాని ఉద్యోగ భద్రత గాని గ్రాడ్యుటి గాని ఏ ఒక్క సౌకర్యాలు అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం తెగేదాకా లాగితే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని దీన్ని గమనంలో ఉంచుకోవాలని జగన్మోహన్ రెడ్డికి హితవ్ పలికారు.

1) అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి హామి ఇచ్చిన విధంగా తెలంగాణా కన్న అదనంగా వేతనాలు పెంచాలి.

2) సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు మన రాష్ట్రంలో కూడా గ్రాడ్యూటీ అమలు చేయాలి.

3) రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ సెంటర్లన్ని తక్షణమే మెయిన్ సెంటర్లుగా మార్చాలి. మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి.

4) రిటైర్మెంట్ బెపిఫిట్ 5 లక్షలకు పెంచాలి. ఆఖరి వేతనంలో 50% పెన్షన్ ఇవ్వాలి.

5) హెల్పర్ల ప్రమోషన్లో నిర్ధిష్టమైన నిబంధనలు రూపొందించాలి. రాజకీయజోక్యం అరికట్టాలి.

6) సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. 10 లక్షలు బీమా అమలు చెయ్యాలి.

7) వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం ఇవ్వాలి.

8) లబ్దిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. ఎస్ఆర్ఎస్ రద్దుచెయ్యాలి. ప్రీస్కూల్ బలోపేతం చెయ్యాలి.

9) ఎస్ఆర్ఎస్ మరియు వివిధ రకాల యాప్ లను రద్దు చేసి ఒక యాప్ ద్వారా విధులు నిర్వహించే విధంగా చేయాలి.

10) వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి. గ్యాసును ప్రభుత్వమే సరఫరా చెయ్యాలి.

11) పెండింగ్లో ఉన్న సెంటర్అద్దెలు, 2017 నుండి టిఎ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలి.
12) పెండింగ్లో ఉన్న గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్ట్ 164ను వెంటనే భర్తీ చేయాలి. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ధవలేశ్వరి, సత్యవతి, అనురాధ, శ్రీదేవి, ప్రమీల, లక్ష్మి, దమయంతి , రాంబాయి ,కాంత, జ్యోతి, మొదలగువారు పాల్గొన్నారు.

 

anganwadi workers strike 32nd day in prakasam

ప్రకాశం జిల్లా మార్కాపురంలో కొనసాగుతున్న అంగన్వాడిలాందోళన

గుంటూరు జిల్లా స్థానిక గ్రంథాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరసన దీక్షలు శుక్రవారం నాటికి 32వ రోజుకి చేరిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎం. రాధాకృష్ణ శిభిరం వద్దకు వచ్చి తన పూర్తి సాంఘి భావాన్ని, మద్దతు తెలిపారు.

చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న అంగన్వాడీల దీక్షలు

anganwadi workers strike 32nd day in eluru

ఏలూరు జిల్లా శిబిరంలో మాట్లాడుతున్న యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి

అనకాపల్లి వంట వార్పులతో వినూత్నముగా అంగన్వాడీ కార్యకర్తల సమ్మె. సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతున్న సి ఐ టి యు నాయకులు, టివి రమణ, గౌరినాయుడు, మండల యూనియన్ నాయకులు మాలతి.

అల్లూరి జిల్లా : ఎస్మా చట్టాన్ని వెనక్కు తీసుకోవాలి, జీవో 2 రద్దు చేయాలి. అఖిలపక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న లోత రామారావు

➡️