36Day: హామీ కాదు.. నిర్ణయం చేయండి

anganwadi workers strike 36days atp sa

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె మంగళవారం నాటికి 36వ రోజుకు చేరుకుంది. నిర్భంధాలను, బెదిరింపులను, పండుగలు కూడా లెక్క చేయకుండా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండివైఖరి విడనాడ లేదు. పైపెచ్చు ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరిస్తోంది.  అయినా పట్టు వీడకుండా అంగన్వాడీలు న్యాయం కోసం పట్టుదలగా ఉద్యమం సాగిస్తున్నారు. అంగన్వాడీల న్యాయమైన కోర్కెలకు సాధారణ ప్రజలు మద్దతు పలుకుతున్నారు, సంఘీభావం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో వీరికి మద్దతుగా నిలిచిన సిపిఎం, సిఐటియు, ప్రజా సంఘాల నేతలు సంక్రాంతి సమయంలోను విజయవాడలోని 63, 64 డివిజన్లు కండ్రిక కాలనీ, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి నేతలు సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో బాబురావు, శ్రీదేవి మాట్లాడుతూ జరిగిన చర్చల్లో ఎన్నికల అనంతరం పెంపుదల గురించి ఆలోచిస్తామని ప్రభుత్వం చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. రోజూ ధరలు పెంచే ప్రభుత్వం ఐదేళ్లకు ఒకసారి మాత్రమే వేతనాలు పెంచాలని కొత్తగా నిబంధనలు చెప్పటం  విచిత్రమైనదని పేర్కొన్నారు. వేలాది కోట్ల రూపాయల దుబారా చేసే ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు ఇవ్వటానికి ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు.  వేలకోట్ల రూపాయలు అవినీతికి పాల్పడే పాలక పార్టీల నేతలు అంగన్వాడీల ఆకలి మంటలు చూడకపోవటం గర్హనీయమన్నారు. ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తోంది, మొండి పట్టుదలకు పోతున్నది, తన బాధ్యతను విస్మరిస్తోందన్నారు. లక్ష మందిని ఉద్యోగాలను తొలగిస్తామని బెదిరించడం పచ్చి నిరంకుశత్వమని అన్నారు. అంగన్వాడీలు ఒంటరిగా లేరని, ప్రజల సంపూర్ణ మద్దతు వారికి ఉందని వారు అన్నారు.

 

ఒంగోలు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల దీక్షలను ప్రారంభించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

 

anganwadi workers strike 36days alluri

పండగలోనూ తగ్గని ఉద్యమ స్ఫూర్తి 

అల్లూరి జిల్లా-రాజవొమ్మంగి : తమ సమస్యల పరిష్కరించాలంటూ అంగన్వాడీలు గత 36 రోజులుగా సమ్మెబాట పట్టిన నేపథ్యంలో సోమవారం, మంగళవారం మకర సంక్రాంతి, కనుమ పండుగనాడు కూడా అంగన్వాడీలు సమ్మె శిబిరం వద్ద రంగుల ముగ్గులు వేసి, కార్మిక సంఘాల పాటలకు లయబద్ధంగా నృత్యాలు చేసి అక్కడే నిరసన తెలిపి ఉద్యమ స్ఫూర్తి చాటుకున్నారు. శిబిరం వద్ద అంగన్‌వాడీలు ఎస్మా చట్టం ప్రతులను మంటల్లో వేసి దహనం చేశారు. సమ్మె డిమాండ్లు ప్రతిబింబించేలా సంక్రాంతి ముగ్గులు వేసి చూపరులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ కుమారి, కె వెంకటలక్ష్మి మాట్లాడుతూ, తమ కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవాల్సిన భోగి మంటలను, సంక్రాంతి, కనుమ పండుగను కూడా నిరసన శిబిరంలో చేసుకోవాల్సిన దుస్థితికి వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అంగన్‌వాడీలు తమ ఆకలి కేకలతో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను నడి రోడ్డుపై జరుపుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు,ఇప్పటివరకు ప్రభుత్వంతో ఆరు దఫాలు చర్చలు జరిపైన తమకు ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు కనుగుణంగా వేతనాలు పెంచమని 36 రోజులుగా సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం, మంత్రులు మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ సమస్యను పరిష్కరించకుండా సాగదీస్తు, అంగన్వాడీలపై బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు,వేతనాలు పెంచేదాకా సమ్మెను విరమించే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు. అంగన్‌వాడీల సమ్మెకు రోజురోజుకు ప్రజల నుండి మద్దతు పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వంతో జరిగిన చర్చల సారాంశాన్ని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి రామరాజు సభ్యులకు వివరించారు, అంగన్‌వాడీలు చాలా పట్టుదలతో చేస్తున్న సమ్మె అనేక ఉద్యోగ,కార్మిక సంఘాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, ఉద్యోగుల, కార్మికుల సమస్యలు పరిష్కారంచడంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు, ఇదే పట్టుదలతో వేతనాలు పెంచుకునేంతవరకు సమ్మెను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు ఎల్ సత్యవతి, నూక రత్నం, నర్సవేణి, రమణి, మంగ, చిన్నమ్ములు, సుందరమ్మ, రత్నం, నాగమణి, రాధా, భవాని, రాజేశ్వరి, లక్ష్మీ, వీరయ్యమ్మ, వీరలక్ష్మి తది తరులు పాల్గొన్నారు.

anganwadi workers strike 36days atp

కొనసాగుతున్న అంగన్వాడీ సమ్మె

అనంతపురం జిల్లా – పుట్లూరు : అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమ్మె 36వ రోజుకు చేరుకుని ప్రశాంతంగా సమ్మె కొనసాగుతున్నది. సిపిఎం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సూరి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు కాబట్టి ఇచ్చిన హామీలే అడుగుతున్నారని అన్నారు. రరత్నాలు కాదయ్యా దశ రత్నాలు అనే పేరుతో మాది ఒకటి చేర్చాలని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పుట్లూరు మండల కార్యదర్శి ఎస్ సూరి, ఏపీ రైతు సంఘం జి వెంకట చౌదరి, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు టి పెద్దయ్య, కార్యదర్శి బి భాస్కర్ రెడ్డి, కెవిపిఎస్ నాగభూషణ్, ఐద్వా మండల కార్యదర్శి టి రేణుక అంగనవాడి మండల అధ్యక్షురాలు జయలలిత, అనంతలక్ష్మి, రమాదేవి, శశికళ, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ తదితరులు సిఐటియు మండల నాయకులు పుణ్య పురుష వీర రాఘవరెడ్డి అహ్మద్ భాషా తదితరులు పాల్గొన్నారు.

anganwadi workers strike 36days akp

 

అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో అంగన్వాడీల సమ్మె…

 

 

జగనన్న పండగ రోజు పస్తులేనా
దరిశిలో 36వ రోజు సమ్మె చేసిన అంగన్ వాడీలు

ప్రకాశం జిల్లా : అంగన్ వాడీలకు వేతనాలు పెంచాలని పండగ రోజులు సంక్రాంతి అయిన సమ్మె 36వ రోజులు కూడా దరిశి ICDS ఆఫీసు వద్ద అంగన్ వాడీ కార్యకర్యలు , అయాలు నినాదాలు ఇచ్చి ముగ్గులతో నిరసన తెలిపారు. జగనన్న పండుగ పూట కూడా పస్తులతో ఉండే విధంగా పిల్లలు, భర్త, కుటుంబాన్ని వదిలి పెట్టి రోడ్డున వైసిపి ప్రభుత్వం పడవేసిందని అంగన్ వాడీ యూనియన్ దరిశి ప్రాజెక్టు అధ్యక్షలు ఎ.తిరపతమ్మ, నాయకులు కె.బాలమ్మ అన్నారు. వారు మాట్లాడుతూ పండగ రోజులు క్రిష్టమస్ , నూతన సంవత్సరం , సంక్రాంతి సమ్మె శిభిరాలలోనే జరుపుకునే విధంగా ముఖ్యమంత్రి చేశారని , చాలి, చాలని వేతనాలతో జీవనం సాగించడం సాధ్యం కావడం లేదని, ప్రభుత్వ పధకాలు ఏమి అందడం లేదని, వేతనాలు పెంచి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగమణి , నిర్మాల , పార్వతి , నరసమ్మ , విజయ , సుశీలా , చైతన్య బారతి, వెంకట రమణ , సందు వెంకటేశ్వరరావు , రామ్ కోటిరెడ్డి, రంగారావు పాల్గొన్నారు.

anganwadi workers strike 36days aap

ఆమ్ ఆద్మీ మద్దతు 

అంగన్వాడీల సమ్మె 36 రోజు వాళ్లకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు సుదర్శన్ పాల్గొన్నారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టాల్ని ఎత్తివేసి సమస్యలు పరిష్కరించాలని జగనన్న గోవిందా అని నినాదాలతో మద్దతు తెలియజేశారు. పార్టీ నాయకులు నవీన్, తదితరులు పాల్గొన్నారు.

➡️