ఉత్తరాంధ్రను మోసం చేసేందుకు జగన్‌ మరో నాటకం 

Mar 7,2024 09:37 #CM YS Jagan, #CPI, #Uttarandhra
  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉత్తరాంధ్ర ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేసేందుకు ఎన్నికలయ్యాక విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తామంటూ మరో నాటకం ఆడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు మరో దొంగ నాటకానికి తెర తీశారని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక విశాఖపట్నంలోనే ప్రమాణస్వీకారం చేస్తానని, అక్కడే నివాసం వుంటూ పరిపాలన చేస్తానని చెప్పటం ఆయన నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. సిఎం జగన్‌కు ధైర్యం వుంటే మూడు రాజధానుల అంశాన్ని వైసిపి మేనిఫెస్టోలో పెట్టాలన్నారు. అమరావతి రాజధాని కోసం 33 వేల ఎకరాలు భూములిచ్చిన రైతులను నట్టేట ముంచారని విమర్శించారు. కర్నూలులో న్యాయ రాజధాని అన్న సిఎం కర్నూలు కోసం కేంద్రానికి ఎన్ని లేఖలు రాశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. న్యాయ రాజధాని పేరుతో రాయలసీమ ప్రజలను మోసం చేశారని అన్నారు. అలాగే విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ యత్నాలు చేస్తుంటే కనీసం నోరు మెదపడం లేదని విమర్శించారు. త్వరలో బజాజ్‌ నుంచి సిఎన్‌జి బైక్‌న్యూఢిల్లీ : ప్రముఖ వాహనాల తయారీ సంస్థ బజాజ్‌ ఆటో వచ్చే త్రైమాసికం ముగింపు నాటికి సిఎన్‌జి బైక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే తొలిసారిగా సిఎన్‌జితో నడిచే ద్విచక్ర వాహనాన్ని తీసుకురానున్నామని బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ వెల్లడించారు. 2025 నాటికి దీన్ని తీసుకొస్తారని తొలుత వార్తలు వచ్చిన్పటికీ.. ముందుగానే తీసుకురావడం విశేషం. పెట్రోల్‌ బైక్‌తో పోలిస్తే కాస్త ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. 11న సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎ సిరీస్‌ విడుదలన్యూఢిల్లీ : సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ తన స్మార్ట్‌ఫోన్‌ విభాగం పోర్టుపోలియోను పెంచుతోంది. మార్చి 11న తన గెలాక్సీ కొత్త ఎ సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. తాము ప్రవేశపెట్టనున్న ఈ కొత్త ఉత్పత్తులు వినియోగదారుల అనుభవాన్ని మరింత గొప్పగా మార్చనున్నాయని సామ్‌సంగ్‌ తెలిపింది.

➡️