AP assembly: స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్‌ స్థానానికి ఒకే నామినేషన్‌ దాఖలుతో స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడి లాంఛనం ఎన్నికయ్యారు. అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాసన సభలో ప్రకటించారు. దీంతో ఏపీ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు వ్యవహరించనున్నాడు. అయ్యన్నపాత్రుడుని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ యాదవ్‌.. స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడుకి సభలోని సభ్యులంతా అభినందనలు తెలిపారు.

➡️